ఎక్స్‌లో ఇకపై సినిమాలు.. మస్క్ మరో సంచలనం
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్ అధినేత మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్‌లో కూడా సినిమాలు సినిమాలు పోస్టు చేసుకోవచ్చిన తెలిపారు. సబ్‌స్క్రయిబర్లు తన సినిమాలను, టీవీ సీరియర్లను పోస్టు చేసుకోవచ్చని తెలిపారు. వాటిని మానెటైజ్ చేసుకొని దాని ద్వారా డబ్బు కూడా సంపాదించుకోవచ్చని ఎలన్ మస్క్ ప్రకటించారు.
ఆయన ప్రకటనపై ట్విట్టర్ యూజర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. సీనిమాలను చూసుకునే అవకాశం సబ్‌స్క్రయిబర్లకు మాత్రమే కాకుండా యూజర్లు అందరికీ వీలు కల్పించాలని అన్నారు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే సినిమాలు చూసుకునేలా అవకాశం ఉండేలా చేయాలన్నారు. అప్పుడు ఎక్స్ నిజమైన సినిమా వేదిక అవుతుందని అంటున్నారు. అంతేకాదు.. ఎక్స్‌కు మెరుగైన వీడియో ప్లేయింగ్ యంత్రాంగం అవసరమని మరో యూజర్ సూచించారు.
ఇక మస్క్ మరో ప్రకటన కూడా చేశారు. త్వరలో ఏఐ ఆడియెన్సెస్ అనే మరో ఫీచర్‌నూ పరిచయం చేయనున్నామని చెప్పారు. ప్రకటనలను సరైన యూజర్లకు చేరవేయటం కోసం దీన్ని తీసుకొని వస్తున్నామని అన్నారు.
సంచలనాలకు మారు పేరుగా మస్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత సంచలన మార్పులు చేస్తూనే ఉన్నారు. దాని పేరును ఎక్స్ అని మార్చడం మొదలు... ఉద్యోగులకు పెద్దఎత్తున లే ఆఫ్‌లు ఇచ్చారు. ఇలా తీసుకున్న ప్రతీ నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసేలా చేశారు.