ఎయిర్ పోర్ట్ లో కంగనా రనౌత్ కు చేదు అనుభవం

ఎయిర్ పోర్ట్ లో కంగనా రనౌత్ కు చేదు అనుభవం

విశ్వంభర, చండీగఢ్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా ఢిల్లీకి బయల్దేరింది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమాశ్రయంలో బోర్డింగ్ పాయింట్ కు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ప్రస్తుతం ఆ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరించేలా నటి చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

Related Posts