పెద్ద పెండ్యాల సిసి రోడ్ కి రూ. 1.75 కోట్లు మంజూరు చేసిన కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ

  • శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి 

WhatsApp Image 2025-01-20 at 13.21.24వరంగల్ కుడా ఛైర్మన్ చొరవతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, ధర్మసాగర్ మండలంలోని పెద్ద పెండ్యాల గ్రామంలో పాత బస్ స్టాండ్ నుండి రెడ్డిపల్లి చర్చి వయా గ్రామ పంచాయతీ వరకు సింగిల్ లేన్ రోడ్డు ను డబుల్ రొడ్డుగా మార్చడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  కృషితో కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ (కుడా) 1.43 కిలో మీటర్ల మేర రూ. 1.75 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ఈరోజు స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గార్లతో కలిసి శంఖుస్థాపన చేశారు. కార్యక్రమంలో కుడా పీవో అజిత్ రెడ్డి  ఈఈ భీం రావు  ఇతర మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన కుడా ఛైర్మన్.        

కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ* గత BRS పాలనలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్లను అభివృద్ధి చేయడం, సక్రమంగా నిర్వహించడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని అన్నారు. ఈరోజు పెద్ద పెండ్యాల గ్రామంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు అయ్యాయని, గ్రామాల్లో 1323.86 కిలో మీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణ పనుల కోసం రూ.1377.66 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ క్రమంలోనే కుడా ద్వారా రోడ్ల అభివృద్దికి రూ. 1.75 కోట్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా తెలియచేశారు. ప్రజల అవసరాన్ని బట్టి మరిన్ని రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో మాజీ సర్పంచి తోట స్రవంతి, మాజీ ఎంపీటీసీ తోట నాగరాజు, సంఘం సబ్యులు ఇతరులు పాల్గొన్నారు.

Read More ఘనంగా విత్రీ న్యూస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కేంద్ర ఖాది చిన్న పరిశ్రమల మండలి పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

Tags: