కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు

కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు

గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది.

గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు కే రాజన్‌, పీ రాజీవ్‌, వీణా జార్జ్‌ భారతీయుల మృతదేహాలను స్వీకరించారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోడియం వద్ద మృతదేహాలకు సీఎం, మంత్రులు, అధికారులు నివాళులర్పించారు.

మరోవైపు ప్ర‌మాదం జరిగిన హౌసింగ్ భ‌వ‌నంలో ఉన్న మొత్తం 176 మంది భారతీయ కార్మికులలో 45 మంది మృతిచెందారని, మరో 33 మంది గాయపడ్డారని కువైట్‌లోని భార‌త‌ ఎంబసీ వెల్ల‌డించింది. క్ష‌త‌గాత్రులు ప్రస్తుతం కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇక మృతుల్లో కేరళకు చెందిన 23 మంది ఉంటే.. తమిళనాడుకు చెందిన 7, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 3, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 3, కర్ణాటకకు చెందిన వారు ఇద్ద‌రు ఉన్నట్లు తెలుస్తోంది. 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అలాగే బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల‌కు చెందిన‌ ఒక్కొక్కరు చొప్పున మృతిచెందిన‌ట్లు పేర్కొంది. అదేవిధంగా కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని లేబర్ హౌసింగ్ ప్రాంతం నుంచి ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి మృతదేహాలు వెంటనే స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక ఐఏఎఫ్‌ విమానాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృత‌దేహాల‌ను త్వరగా స్వదేశానికి రప్పించడానికి కువైట్ అధికారులతో సమన్వయం చేసిన విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సైతం విమానంలో ఉన్నట్లు సమాచారం.

 

Related Posts