కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభణ…12 మంది మృతి..!

కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 12 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 12 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో నాలుగున్నర నెలల్లో 1,977 కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు.

కాగా, వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని నీటి వనరులను క్లోరినేషన్ చేయనున్నట్లు తెలిపారు. రెస్టారెంట్‌లలో కాచిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని ఆమె సూచించారు.

Read More కంచర్లగూడెంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

మరోవైపు హెపటైటిస్ ఎ వైరస్(HAV) కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి కలిగిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈ సంవత్సరం రాష్ట్రంలో మరో 5,536 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. సుమారు 15 మంది ఈ వైరస్ కారణంగా మృతిచెందినట్లు సమాచారం.

🕒 16 May 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/hepatitis-a-virus-outbreak-in-kerala12-dead/article-225

Related Posts

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?