కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

విశ్వంభర, ఢిల్లీ : లిక్కర్ స్కాం​ కేసులో కవిత బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. బెయిల్ కోరడంతో పాటు అరెస్ట్, రిమాండ్ ను కవిత సవాల్ చేశారు. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారణ చేపట్టగా...సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది. కవిత తరఫున కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లను ఈడీ, సీబీఐ దాఖలు చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా పడింది. 

ఇది ఇలా ఉంటే జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ను కోర్టు అంగీకరించింది. కానీ కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోకి తీసకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారంటే కూడా లేకుండానే సీబీఐ అరెస్ట్ చేసిందని తెలిపారు. రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది.

Read More  రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు