పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 

పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 

విశ్వంభర, చండూర్ :- కొత్త కోర్సులు, కనీస వసతులు లేకపోవడంతో ప్రభుత్వ కళాశాలలు పూర్తిగా కళతప్పుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు కొరవడటంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సరైన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ వసతులు లేకపోవడంతో గత్యంతరం లేక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు లేదా ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక కేవలం ప్రభుత్వ కళాశాలలనే నమ్ముకున్న నిరుపేద, గ్రామీణ విద్యార్థుల పాలిట ఈ పరిస్థితి పెను శాపంగా మారింది. ప్రభుత్వం మరియు ఉన్నత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు, భవిష్యత్తుకు ఉపయోగపడే నూతన కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని, లేనిపక్షంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని  మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు , బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్  గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
 
 
 
 

Tags:  

Advertisement

LatestNews

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. - 
పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 
దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 
టాస్ పరీక్షల్లో రెండవ సెషన్స్ లో 95 మంది గైర్హాజరు
ఘనంగా పంతంగి లో హిందూ సమ్మేళనం 
రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నాం