రేణుకాఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రేణుకాఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

   విశ్వంభర,  మహేశ్వరం:  మహేశ్వరం మండలం మన్సన్ పల్లి గ్రామంలో శ్రీ రేణుకాఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి, ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ కంది అరుణ రమేష్ తెలిపారు .  శనివారం గణపతి హోమం తో ప్రారంభమై,  మంగళవారం బోనాలతో   బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి . వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని తెలిపారు.  ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలలో భాగంగా  గ్రామ సర్పంచ్ పుష్ప మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ నిర్వాహకులతో   గణపతి హోమంలో పాల్గొన్నారు, సర్పంచ్ మాట్లాడుతూ   ప్రతి ఒక్కరు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా  బ్రహ్మోత్సవాలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  శ్రీ రేణుక ఎల్లమ్మ  కమిటీ చైర్మన్ కంది అరుణ రమేష్ కోరారు, ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ మర్యాద రాఘవేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,

Tags: