పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. బోల్తాపడిన ఇంజిన్ - బోగీలు ఒకదానికొకటి దూసుకుపోయాయి.

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. బోల్తాపడిన ఇంజిన్ - బోగీలు ఒకదానికొకటి దూసుకుపోయాయి. అమృత్ సర్, ఢిల్లీ రైల్వే లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లకు గాయాలైనట్లు సమాచారం. 

క్షతగాత్రులను శ్రీ ఫతేగర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటియాలాలోని రాజిందర్ ఆసుపత్రికి తరలించారు. రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read More బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

Related Posts