విషాదం: దంపతులపై విరిగిపడ్డ చెట్టు.. భర్త మృతి

విషాదం: దంపతులపై విరిగిపడ్డ చెట్టు.. భర్త మృతి

హైదారాబాద్‌లోని బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది.

04-664c3f8eec894చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. ప్రాంగణంలోని చెట్టు విరిగి దంపతులపై పడింది. ఈ ఘటనలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.