ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో విషాదం.. స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో విషాదం.. స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

  • సూసైడ్ నోట్‌లో ప్రేమించిన యువతి కారణమంటూ యువకుడి వ్యాఖ్య

Hyderabad News: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని VST స్టీల్ బ్రిడ్జిపై విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన బైక్‌ను బ్రిడ్జిపై పార్క్ చేసి, అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనతో స్థానికంగా కలకలం నెలకొంది. యువకుడు ముందుగా తన బైక్‌ను బ్రిడ్జిపై నిలిపినట్లు తెలుస్తోంది. అనంతరం తన మొబైల్ ఫోన్‌లో సూసైడ్ నోట్ రాసి, ఫోన్‌ను బైక్‌పై ఉంచి బ్రిడ్జిపై నుంచి కిందికి దూకినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

తన ఆత్మహత్యకు అప్పులు కారణం కాదని, తాను ప్రేమించిన యువతి కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే యువకుడి పూర్తి వివరాలు, అతడు తీసుకున్న నిర్ణయానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. మొబైల్ ఫోన్‌లో ఉన్న సూసైడ్ నోట్‌తో పాటు ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

Read More ఆదిభట్లలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి.. 22 మంది అరెస్ట్