భారీ పేలుడు.. 20 మంది మృతి

భారీ పేలుడు.. 20 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతారా జిల్లాలోని గన్‌పౌడర్ పేలి 20 మంది మృతి చెందారు. బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో ఉన్న స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్ గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో  ఫ్యాక్టరీలో 40 మందికిపైగా విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.  పేలుడు ప్రభావంతంతో స్థానికంగా ఉండే చాలా ఇళ్లు కూడా బీటలు వారాయని స్థానికులు చెబుతున్నారు. 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

ఘటన తర్వాత స్థానికులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీలోని కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.