పూణే కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్..!

పూణే కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్..!

కారును నడిపింది తన కొడుకు కాదని డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. డ్రైవర్ కూడా తానే కారు నడిపినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. మైనర్ స్నేహితులు కూడా డ్రైవరే కారు నడిపాడని చెప్పారు.

పుణే కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారును నడిపింది తన కొడుకు కాదని డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. డ్రైవర్ కూడా తానే కారు నడిపినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. మైనర్ స్నేహితులు కూడా డ్రైవరే కారు నడిపాడని చెప్పారు. పుణేలో గత ఆదివారం తెల్లవారుజామున 3.15గంటలకు పోర్సే కారు వేగంగా వచ్చింది. తన ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. 

కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్‌లోనే మృతిచెందారు. కళ్యాణినగర్ ప్రాంతంలో పబ్‌లో మద్యం సేవించిన 17 ఏళ్ల బాలుడు గంటకు 200 కి.మీ. వేగంగా వెళ్తున్న పోర్షే కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్ అవధియా, అశ్విని కోష్ట అనే ఇద్దరు ఐటీ నిపుణులను ఢీకొట్టింది. అశ్విని 20 అడుగుల మేర గాలిలోకి ఎగిరి పడిపోయాడు. అనీష్‌ను ఆగి ఉన్న కారులోకి విసిరివేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడి తండ్రి రియల్ ఎస్టేట్ డెవలపర్ కొడుకుని పోలీసులు గుర్తించారు. 

Read More ఉద్యోగులకు ప్రతినెల 1 వ తేదీన వేతనం చెల్లించాలి 

అయితే గంటల వ్యవధిలోనే బెయిల్‌పై బయటికి తెచ్చాడు. నిందితుడికి కోర్టు బెయిల్ మంజూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కారు నడిపింది తన కుమారుడు కాదని, తమ డ్రైవర్ అని బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ చెప్పడం పలు విమర్శలకు దారితీస్తోంది. ప్రమాదానికి సంబంధించి వీడియో ఆధారిత సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఈ కేసు నుంచి మైనర్‌‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికించారనడంలో ఎలాంటి సందేహం లేదని నెటిజన్లు అంటున్నారు.