పూణే కారు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్.. బాలుడి తల్లి అరెస్ట్

పూణే కారు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్.. బాలుడి తల్లి అరెస్ట్

ప్రమాదానికి కారణమైన బాలుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు కుటుంబసభ్యులు చేస్తున్న ప్రయత్నాలు విస్తు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు తాజాగా ప్రమాదానికి కారణమైన బాలుడి తల్లిని అరెస్టు చేశారు. 

పూణేలో ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేశారు. ప్రమాదానికి కారణమైన బాలుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు కుటుంబసభ్యులు చేస్తున్న ప్రయత్నాలు విస్తు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు తాజాగా ప్రమాదానికి కారణమైన బాలుడి తల్లిని అరెస్టు చేశారు. 

బ్లడ్ టెస్ట్ సమయంలో బాలుడి రక్త నమూనాలకు బదులుగా తల్లి రక్తనమూనాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆమెను అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో బాలుడు తాగలేదని నిరూపించేందుకు ఆమె రక్తనమూనాలను ఇచ్చినట్లు పోలీసులు శనివారం మీడియాతో వెల్లడించారు.ఇప్పటికే ఈ కేసులో నిందితుడి తండ్రి, తాతను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేసి ఒత్తడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమైంది. నిందితుడి రక్తనమూనాలు మారిస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరినట్లు సమాచారం. బ్లడ్ శాంపిళ్లు మార్చిన డాక్టర్‌పై వేటు విధించిన విషయం తెలిసిందే. వీరితో పాటు ఓ గుమాస్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంత జరిగినా నేరాన్ని కప్పిపుచ్చేందుకు నిందితుడి కుటుంబసభ్యులు అధికారులనూ ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.