నాసిక్‌లో ఏఐఎంఐఎం నేతపై కాల్పులు

నాసిక్‌లో ఏఐఎంఐఎం నేతపై కాల్పులు

ఏఐఎంఐఎం నేత, మాలేగావ్ మాజీ మేయర్.. అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్‌పై ఇవాళ(సోమవారం) తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.

ఏఐఎంఐఎం నేత, మాలేగావ్ మాజీ మేయర్.. అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్‌పై ఇవాళ(సోమవారం) తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు మూడు తూటాలు తగిలినట్లు సమాచారం. వెంటనే మాలిక్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. ఛాతి ఎడమ భాగం, కుడి తొడ, కుడి చేయికి గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆయన్ను నాసిక్‌లో మరో వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట్ర ఎంఐఎం శాఖలో అబ్దుల్ ప్రముఖ నాయకుడు. సోమవారం తెల్లవారు జామున 1.20 సమయంలో ఓల్డ్ ఆగ్ర రోడ్డులోని ఒక రెస్టారంట్ ఎదుట మాలిక్ కూర్చొని ఉండగా ఈ దాడి జరిగినట్లు నాసిక్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో వేసవి తీవ్రతకు స్థానికులు అర్ధరాత్రి కూడా మెలకువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

Read More పాక్‌ దాడులకు దీటుగా జవాబిద్దాం

Related Posts