15 ఏళ్ల బాలిక ఘాతుకం.. ప్రియుడి కోసం తండ్రిని, సోదరుడిని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో..

 15 ఏళ్ల బాలిక ఘాతుకం..  ప్రియుడి కోసం తండ్రిని, సోదరుడిని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో..

ప్రేమించిన యువకుడి కోసం కన్నతండ్రిని సోదరుడిని చంపేసింది ఓ బాలిక. తన ప్రేమను అడ్డుకోవడమే కాకుండా.. ప్రియుడిని జైళ్లో పెట్టించారని కన్నవారిపై పగ పెంచుకున్న బాలిక అదును చూసి ఇద్దరిని అంతమొందించింది.

విశ్వంభర, మధ్య ప్రదేశ్ : ప్రేమించిన యువకుడి కోసం కన్నతండ్రిని సోదరుడిని చంపేసింది ఓ బాలిక. తన ప్రేమను అడ్డుకోవడమే కాకుండా.. ప్రియుడిని జైళ్లో పెట్టించారని కన్నవారిపై పగ పెంచుకున్న బాలిక అదును చూసి ఇద్దరిని అంతమొందించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జబల్పూర్ లో 15 ఏళ్ల బాలిక స్థానికంగా నివాసం ఉంటున్న ముకుల్ సింగ్‌ (19)తో ప్రేమ‌లో పడింది. బాలిక ఇంట్లో విష‌యం తెలియడంతో ఇద్దరిని మందలించారు. దీంతో ప్రేమికులు ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో మైన‌ర్‌ను ఎత్తుకెళ్లినందుకు ముకుల్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. త‌న ప్రియుడిని జైల్లో పెట్టించి.. తన ప్రేమకు అడ్డుపడుతున్నారని బాలిక తన కుటుంబ సభ్యులపై కోపం పెంచుకుంది. ముకుల్ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ప్రేమికులు ఇద్దరు బాలిక ఇంటికి వెళ్లారు. అజాగ్రత్తగా ఉన్న తండ్రిని, సోదరుడిని చంపి.. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టింది. ఈ డబుల్ మర్డర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమికుల కోసం రెండు నెలలుగా గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం బాలిక హరిద్వార్‌లో పట్టుబడింది. ప్రియుడు ముకుల్‌ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా వెతుకుతున్నారు. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

Related Posts