చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100కోట్లు..!!

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100కోట్లు..!!

ఉత్తర్‌ప్రదేశ్ ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారులు కంగుతిన్నారు. చెప్పుల వ్యాపరుల ఇళ్లలో కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారులు కంగుతిన్నారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏమూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. ఆ డబ్బు లెక్కపెట్టలేక యంత్రాలే ఆగిపోయాయి. ఆ డబ్బుల కట్టలతో పాటు ఆక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్‌ చేశారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. సుమారు 42 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బును గుర్తించింది. ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో కూడా 500 రూపాయల నోట్ల కట్టలు కోట్లల్లో లభ్యంకావడంతో షాకయ్యారు.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

వ్యాపారుల ఇళ్లల్లో డబ్బుతోపాటు బంగారు, వెండి ఆభరణాలను కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాల పత్రాలను అధికారులు సీజ్‌ చేశారు. ఈ అక్రమాస్తులు లెక్క ఇప్పటివరకూ రూ.100 కోట్లు తేలిందని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించాయి. దర్యాప్తు బృందం శనివారం ఉదయం 11 గంటలకు ఆగ్రాలోని 14 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related Posts