వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..!
On
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ (గురువారం) నాని స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ (గురువారం) నాని స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు వైద్యులకు సమాచారం అందించారు.
ప్రధమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. అయితే, నాని అతిగా ఆలోచించడంతోనే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్‌మెన్లు, కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. కాగా, విషయం తెలుసుకున్న నాని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు బయల్దేరి వెళ్లినట్లు సమాచారం.