చంద్రబాబు, పవన్ నాయకత్వంలో మంచిరోజులు: అంబటి రాయుడు

చంద్రబాబు, పవన్ నాయకత్వంలో మంచిరోజులు: అంబటి రాయుడు

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎక్స్ వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. వారి నాయకత్వంలో ప్రధాన పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. 

ఏపీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎక్స్ వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. వారి నాయకత్వంలో ప్రధాన పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. 

డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న రాయుడు జనవరి 6న ఆ పార్టీని వీడుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆతర్వాత జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ తన ఆలోచనలకు దగ్గరగా ఉందని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే జనసేనలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఎన్నికల ఫలితాలపై జనసేనానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు రాయుడు.

Related Posts