పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలుః మంత్రి లోకేష్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలుః మంత్రి లోకేష్

ఉన్నతాధికారులతో సమీక్షలు
స్కూళ్లలో మౌలిక వసతులపై ఆదేశాలు


ఇక నుంచి ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన పారదర్శక విధానాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం ఉండవల్లి నివాసంలో ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విద్యాశాఖలో పూర్తి స్థాయి మార్పులు రావాలన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులను పూర్తి చేయలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించాలని ఆదేశించారు. ఇక స్కూళ్లలో మధ్యాహ్న భోజనంపై కూడా ఆరా తీశారు నారా లోకేష్. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం కూడా రుచికరంగా, నాణ్యతతో ఉండాలిన సూచించారు.

Read More డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు

స్కూళ్లలో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ విధానాలను అధ్యయనం చేసి వాటినే మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తామని ఆయన వివరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ను గత ప్రభుత్వంలో మూసేశారో, అందుకు కారణాలను తెలిపాలన్నారు. దాంతో పాటు సీబీఎస్ ఈ స్కూళ్ల వినియోగంపై కూడా పూర్తి స్థాయి వివరణ అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Related Posts