షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..!

షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..!

ఏపీ కాంగ్రెస్ లో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే షర్మిల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా షర్మిల మీద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నిరోజులు రాహుల్ గాంధీమీదున్న అభిమానంతో షర్మిలను ఏమీ అనలేకపోయామని.. కానీ షర్మిల మాత్రం కక్షపూరిత చర్యల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిందని మండిపడ్డారు.

ఏపీ కాంగ్రెస్ లో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే షర్మిల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా షర్మిల మీద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నిరోజులురాహుల్ గాంధీమీదున్న అభిమానంతో షర్మిలను ఏమీ అనలేకపోయామని.. కానీ షర్మిల మాత్రం కక్షపూరిత చర్యల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిందని మండిపడ్డారు.

మొన్న ఎలక్షన్లలో పార్టీ ఇచ్చిన ఫండ్ ను షర్మిల ఒక్కతే కాజేసిందని సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలకు కనీసం జెండాలు కూడా ఇవ్వకుండా.. ఆ డబ్బులుకూడా కాజేసిందని ఆరోపించారు పద్మ శ్రీ. 

Read More  రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు

పార్టీలో సీనియర్లను చెత్తబుట్టల్లాగా చూసిందని.. కనీసం ఏ ఒక్కరికీ కూడా విలువ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని షర్మిలపై ఆమె మండిపడ్డారు. షర్మిల తప్ప కాంగ్రెస్ లో ఏ ఒక్కరూ మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మాణిక్కం ఠాగూర్ కూడా షర్మిలకే వత్తాసు పలికారని.. రాహుల్ గాంధీని కూడా ఎన్నికల ప్రచారానికి రప్పించలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

త్వరలోనే షర్మిల సంగతి ఢిల్లీలో చూసుకుంటామని.. ఆమెను పదవి నుంచి తీయించేస్తామని వార్నింగ్ ఇచ్చారు పద్మశ్రీ. ఈ సమావేశంలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.