పవన్ కల్యాణ్‌కు  సాయి ధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్

పవన్ కల్యాణ్‌కు  సాయి ధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్

  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌కు శుభాకాంక్షల వెల్లువ
  • నిన్న అత్యంత ఖరీదైన పెన్ను బహూకరించిన వదిన సురేఖ
  • నేడు మేనల్లుడి స్పెషల్ గిఫ్ట్ 

ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కల్యాణ్‌కు అభిమానులు, ప్రముఖులతో పాటు కుటుంబసభ్యులు అభినందనలు తెలుపుతున్నారు.తాజాగా, పవన్ కల్యాణ్ మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ ఓ స్పెషల్ గిఫ్ట్‌ను అందజేశాడు. 

దీనికి సంబంధించిన ఫొటోను సాయి ధరమ్ తేజ్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశాడు. సాయిధరమ్ తేజ్ ఇటీవల పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకొని శనివారం ఆ మొక్కు తీర్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ కు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మంచి గిఫ్ట్ అందించాడు. ‘‘నన్ను స్టార్ వార్స్ లెగోకు పరిచయం చేసిన నా ప్రియమైన జేడీ మాస్టర్ అండ్ డిప్యూటీ సీఎంకు.. చివరకి నా చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు అతనిలోని చైల్డ్‌కు గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ లభించింది. ’’ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. 

Read More డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు