హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. 23 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు సమాచారం. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతోందని అన్నారు.
ఈ క్రమంలో ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లో భారీ వర్షం మొదలైంది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో మబ్బులు కమ్మేశాయి. ఆయా ప్రాంతాల్లో సైతం మరికాసేపట్లో వర్షం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు