ఆగస్టు 5న దేవరపల్లిలో జగన్ పర్యటన.. పొగాకు రైతులతో ముఖాముఖి

  • పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు దేవరపల్లికి జగన్
  • పొగాకు ధరల పతనంపై ప్రభుత్వం స్పందించాలి.. మాజీ మంత్రి గుడివాడ అమర్

YS Jagan Mohan Reddy: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగస్టు 5న పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్ తెలిపారు. ఈ సందర్భంగా పొగాకు రైతులను నేరుగా కలిసి వారి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను తెలుసుకోనున్నారని చెప్పారు. పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, వారి తరఫున ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకే జగన్ పర్యటన చేపడుతున్నారని పేర్కొన్నారు.

గుడివాడ అమర్ మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ.450 వరకు పలికేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో అదే కిలో పొగాకు రూ.170కే పరిమితమైందని విమర్శించారు. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోగా, ప్రతి కిలోపై రూ.100 నుంచి రూ.150 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More పోలీసుల కళ్లుగప్పి పరారైన చోరీ కేసు నిందితుడు.. కదిరిలో హైటెన్షన్

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో కర్ణాటకలో పొగాకు సీజన్ ప్రారంభమవుతుందని, వ్యాపారులు అటువైపు మళ్లిపోయే ప్రమాదం ఉందని గుడివాడ అమర్ హెచ్చరించారు. అలా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పొగాకు కొనుగోళ్లకు అనుకూల పరిస్థితులు కల్పించాలని ఆయన కోరారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-visit-to-devarapalli-on-august-5-was-a-face-to-face/article-20496

Related Posts