పులివెందులలో జగన్ విజయం.. భారీగా తగ్గిన మెజార్టీ
On
- పులివెందులలో జగన్ విజయం
- భారీగా ఓట్లు చీల్చిన టీడీపీ అభ్యర్థి
- పడిపోయిన వైఎస్ జగన్ మెజీర్టీ
విశ్వంభర, కడప : పులివెందులలో జగన్ సునాయాసంగా విజయం సాధించారు. ఆయన గెలుపు ఎలాగూ లాంఛనమే అయినా.. గతంతో పోలిస్తే ఈ సారి భారీగా మెజార్టీ తగ్గింది. జగన్ ఈ సారి తన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి మీద 59వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇది మంచి మెజార్టీనే అయినా.. గత ఎన్నికలతో పోలిస్తే భారీగా మెజార్టీ తగ్గిందని చెప్పుకోవాలి. గత 2019 ఎన్నికల్లో జగన్ కు 90110 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. కానీ ఈ సారి పార్టీ ఓడిపోవడంతో పాటు జగన్ కు కూడా భారీగానే ఓట్లు తగ్గాయి. రవీంద్రనాథ్ రెడ్డి భారీగా ఓట్లు కొల్లగొట్టారు. జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో వైసీపీకి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది. ఇందుకు ఆయనకు తగ్గిన మెజార్టీనే ఉదాహరణ.