‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ట్రైలర్ చూశారా?

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ట్రైలర్ చూశారా?

కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీలు తీసేందుకు డైరెక్టర్లు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ కళాశాలలో టీనేజీ లవ్ స్టోరీతో ముందుకొచ్చారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించారు. 

ప్రస్తుతం టాలీవుడ్‌ యంగ్ డైరెక్టర్స్‌ యూత్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి కోవలో ఇటీవల ‘బేబీ’ సినిమా ఎంతటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. అలాంటి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీలు తీసేందుకు డైరెక్టర్లు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ కళాశాలలో టీనేజీ లవ్ స్టోరీతో ముందుకొచ్చారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించారు. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైన క్రమంలో ప్రమోషన్స్‌పై ఫోకస్ చేశారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ(శుక్రవారం) విడుదల చేసింది మూవీ టీమ్. ఈ సినిమాలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.

Read More జర్నలిస్టు ఇండ్ల దరఖాస్తు పత్రాలు ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి.