టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంక‌ట కృష్ణారావు కన్నుమూత 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంక‌ట కృష్ణారావు కన్నుమూత 

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. అయితే, ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఈ మేరకు ఆయన పార్థీవ దేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామం దొమ్మెరుకు తీసుకువెళ్లనున్నట్లు కుంటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 5 సార్లు కొవ్వూరు ఎమ్మెల్యేగా కృష్ణబాబు పనిచేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 1983, 1985, 1989, 1994, 2004లో ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ