ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం
On
విశ్వంభర అమరావతి : ఏపీ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా మరోసారి సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం సిఫారస్ పంపింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 మే 28 నుంచి 2019 వరకు ఆయన ఏజీగా బాధ్యతలు నిర్వహించారు.
తిరిగి ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ సందర్భంలో చంద్రబాబు హక్కులను కాపాడడంలో దమ్మాలపాటి శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు నమోదు వరకు అలుపెరగని న్యాయ పోరాటం చేశారు.