ప్లేటు తిప్పేసిన స్వరూపానంద స్వామి.. జగన్ పై విమర్శలు..!

ప్లేటు తిప్పేసిన స్వరూపానంద స్వామి.. జగన్ పై విమర్శలు..!

 

విశాఖ కేంద్రంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు ఫిరాయించేశారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్ కు వంత పాడారు. జగన్ జాతకం ప్రకారం వైసీపీకి 123కి పైగా సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ వైసీపీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన సీట్లు సాధించుకుంది.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

దాంతో స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు తిప్పేశారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు స్వరపానంద ఆశ్రమంలో వైసీపీ నేతలే ఎక్కువగా కనిపించారు. జగన్ ఆశ్రమానికి ఎంతో సాయం చేశారు. 

అయినా సరే ఇప్పుడు స్వరూపానంద ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక చంద్రబాబు పెద్ద వాడు.. ఆయన కుటుంబం బాగుండాలని ఆయన రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను ఇలా చంద్రబాబును పొగడటం కొత్తేమీ కాదని.. గతంలో కూడా చంద్రబాబు గెలవాలని యాగాలు చేసినట్టు గుర్తు చేశారు. 

జగన్ కొన్ని తప్పులు చేశాడని.. చెబితే వినలేదన్నారు. శ్రీశైలం కుంభాభిషేకం ఆపాలని చెబితే.. జగన్ కోర్టులను మేనేజ్ చేసి ఆ అభిషేకం చేశారు. దాంతో పాటు తిరుమల అలాగే సింహాచలంలో జరిగిన తప్పులను నేను ఎత్తి చూపాను. వద్దని చెబితే వినలేదు. అందుకే వైసీపీ ఓడిపోయింది అంటూ చెప్పారు. అయితే ఆయన ఇలా సడెన్ గా ప్లే తిప్పేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.