పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
On
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మే 13న ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి.. ఈవీఎం మెషిన్‌ను ధ్వంసం చేశారు.
ఈ కేసుతో పాటు పోలింగ్ తర్వాత జరిగిన మూడు ఘటనల్లోనూ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ(సోమవారం) విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Read More ఘనంగా కబడ్డీ పోటీలు