పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చంద్రబాబు 

పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చంద్రబాబు 

  • ప్రాజెక్టు పురోగతి పరిశీలన 
  • వివిధ దశల్లో పనుల వివరాలను తెలుసుకున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు స్పిల్‌వే పైకి చేరుకున్నారు. అక్కడ 26వ గేటు వద్ద పనుల వివరాలను ఆరా తీశారు. 

ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. గతంలో ఈ ప్రాజెక్టును ప్రతీ సోమవారం చంద్రబాబు పరిశీలించేవారు. ఐదేళ్ల పాటు వైసీపీ ఈ ప్రాజెక్టు పనుల విషయంలో నిర్లక్ష్యం చేసింది. ఇక, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

Related Posts