ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు క్లారిటీ
ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాన్ బయల్దేరారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయే కూటమితో మద్దతుపై మాట్లాడారు.
ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాన్ బయల్దేరారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయే కూటమితో మద్దతుపై మాట్లాడారు. తాను ఎన్డీయే కూటమిలోనే ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడానికితమ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా బీజేపీ నేత లక్ష్మణ్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. నేడు ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం ఉందని, ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోవడం లాంఛనమని తెలిపారు. ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిందని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది తెలిపారు.