Breaking: లండన్ చేరుకున్న సీఎం జగన్..!
విదేశీ పర్యటననేపథ్యంలో ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. మే 17 నుంచి జూన్ 1 వరకు ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించనున్నారు.
విదేశీ పర్యటన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. మే 17 నుంచి జూన్ 1 వరకు ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల విడుదలకు ముందే జగన్ ఏపీకి తిరిగి వస్తారని వైసీపీ శ్రేణులు తెలిపారు. ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన నిమిత్తం ఇటీవల కోర్టు అనుమతులు కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు కోర్టు అనుమతులు జారీ చేసింది.
సార్వత్రి క ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో రెండు వారాల పాటు విరామం దొరికింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కుటుంబసభ్యులతో కలిసి లండన్ వెళ్లారు. శుక్రవారం రాత్రి విజయవాడ ఎయిర్‌పోర్టులో వైసీపీ నేతలు జగన్‌కు సెండాఫ్ ఇచ్చారు. తాజాగా జగన్ లండన్ చేరుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.