ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర
On
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు.
ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచిరైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలి నడకన బయల్దేరారు. ఉదయం 11 గంటలలోపు అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర సాగనుంది. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.
Read More ఘనంగా కబడ్డీ పోటీలు