బాపట్లలో యువతిపై లైంగికదాడి, హత్య
On
- పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు?
- ఘటనాస్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి
- రూ.10లక్షల పరిహారం ప్రకటన
బాపట్ల జిల్లాలో యువతిపై లైంగికదాడి, హత్య ఘటన సంచలనంగా మారింది. బహిర్భూమికి వెళ్లిన సుచరిత(21) అనే యువతిపై కొందరు దుండగులు లైంగికదాడి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి లైంగికదాడి, హత్యకు గురైన సంఘటనాస్థలాన్ని హోం మంత్రి అనిత సందర్శించారు.
48గంటల్లో నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. చీరాల మండలం ఈపురుపాలెంలో హత్యకు గురైన సుచరిత లైంగికదాడి, హత్య ఘటనలో పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అదుపులోకి తీసుకున్న నలుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Read More ఘనంగా కబడ్డీ పోటీలు