రీ పోలింగ్ చేయాలని హైకోర్టులో అంబటి పిటిషన్

రీ పోలింగ్ చేయాలని హైకోర్టులో అంబటి పిటిషన్

ఏపీలో పోలింగ్ ముగిసిన పది రోజులు అవుతున్నా.. ఎన్నికల వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి కారణం పోలింగ్ రోజు నుంచి మూడు రోజుల పాటు చెలరేగిన హింస. ఈ అల్లర్ల వలన పదుల మందికి తలలు పగిలాయి. చాలా మంది చావు అంచుల వరకు వెళ్లారు. వందల మంది పరారీలో ఉన్నారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పులివర్తి నానికి సంబంధించిన ఘటనలు ఇంకా హాట్ హాట్ గానే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్లపై ఎలక్షన్ కమిషన్ సిట్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. 

 

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

అయితే ఇంతలోనే మంత్రి అంబటి రాంబాబు వేసిన ఓ పిటిషన్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన పోటీ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో ఈసీ, సీఈవో సహా మరో ఐదుగురిని చేర్చారు. కాగా, ఆ పిటిషన్‌పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

 

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

మరోవైపు మాచర్లలో రీ పోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీ పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసం అయినా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. కాబట్టి రీపోలింగ్ అవసరం లేదని మీనా చెప్పారు.

Tags:

Related Posts