జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
On
- పులివెందులలో జగన్ 3 రోజుల పర్యటన
- కడప నుంచి పులివెందుల వెళ్తుండగా ఘటన
- రామరాజు పల్లి వద్ద ఇన్నోవాను ఢీకొన్న ఫైర్ ఇంజిన్ వాహనం
ఏపీ మాజీ సీఎం జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ వాహనాలు ఢీకొన్నాయి. జగన్ కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ(శనివారం) జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటిస్తున్నారు. మూడు రోజులు అక్కడే బస చేయనున్నారు. రాయలసీమ కు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారు. మరోవైపు ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు 11మంది మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. శుక్రవారం తొలిరోజు అసెంబ్లీకి హాజరైన జగన్ బరువైన గుండెతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, రెండో రోజు (ఇవాళ) నిర్వహించిన సమావేశానికి జగన్ హాజరు కాలేదు.