జబర్దస్త్ ఆర్టిస్ట్ కు యాక్సిడెంట్... తృటిలో తప్పిన ప్రమాదం
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ పవిత్ర అందరికీ సుపరిచితమే. ఆమె తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఒక వీడియో షేర్ చేస్తూ... తనకు యాక్సిడెంట్ జరిగిందని, కార్ ప్రమాదంలో తుక్కుతుక్కు అయిందని, ప్రాణాలతో బమటపడ్డాను అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
పవిత్ర ఇటీవల మే 11న ఓటు వేసేందుకు తన సొంత ఊరు సోమశిల వెళ్తున్నప్పుడు నెల్లూరు ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వచ్చే కారు వీళ్ళ కార్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదంలో పవిత్రకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు బంధవులకు కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మాత్రం కారు ముందు భాగం తుక్కు తుక్కు అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.