నేడు గుంటక నర్సయ్య పంతులు 122 వ జయంతి

నేడు గుంటక నర్సయ్య పంతులు 122 వ జయంతి

విశ్వంభర, డెస్క్ :- 1903 అక్టోబర్ 3న జన్మించిన గుంటక నర్సయ్య పంతులు పద్మశాలీ సమాజానికి, చేనేతోద్యమానికి, విద్యారంగానికి అపారమైన సేవలు చేసిన మహనీయుడు.

📚 "భృగ్వాధుల ప్రభావం" అనే గ్రంథం రచించి, పద్మశాలీల సిసలైన చరిత్రను ప్రతీ ఒక్కరికీ పరిచయం చేశారు.
🏫 బొంబాయి, సోలాపూర్, అహ్మద్‌నగర్, సూరత్ లాంటి మహానగరాలలో స్థిరపడిన తెలుగు వారి కోసం అక్కడి ప్రభుత్వాలతో చర్చించి తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేయించారు.
👑 “యువక కిషోరమణి”, “చేనేతోద్యమ పితామహ” బిరుదులు ఆయన కృషికి లభించిన గుర్తింపు.

Read More గురుస్వామి మహాపాదయాత్రకు అడుగడుగునా భక్తజన నీరాజనం

🔹 అఖిల భారత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా రెండు సార్లు సేవలందించారు.
🔹 నైజాం రాష్ట్ర పద్మశాలి యువజన సంఘంను స్థాపించి, యువతను ఏకం చేశారు.
🔹 నైజాం రాష్ట్ర పద్మశాలి కష్ట నివారణ సంఘం ద్వారా వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. ఇదే సభలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని పరిచయం చేసి, ఆయనను ప్రజా నాయకుడిగా నిలబెట్టారు.
🔹 1940 నుండి 1946 సంవత్సరాల కాలంలో జగిత్యాల, మహబూబాబాద్, సిరిసిల్ల, వరంగల్ వంటి పట్టణాల్లో సభలు నిర్వహించి పద్మశాలీలను సంఘటితం చేశారు.
🔹 అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా 
సేవలందించారు.
🔹 వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటులో కీలకంగా ఉండి, ఆ ట్రస్టుకు అధ్యక్షుడిగా సేవలు అందించారు.

🧵 చేనేత రంగంలో:

డెక్కన్ చరఖా సొసైటీ స్థాపించి పారిశ్రామికులకు పని కల్పించారు.

చేనేత సహకార ఉద్యమం ప్రారంభించి, రాష్ట్రంలో ఉన్న ప్రతీ సహకార సంఘం వెనుక తన కృషి చూపించారు.

హైదరాబాదు, బొంబాయి, బెంగళూరు వంటి నగరాల్లో చేనేత దుకాణాలు పెట్టి, నైజాం రాష్ట్ర వస్త్రాలను విక్రయించి చేనేతలకి ఉపాధి కల్పించారు.

🏛️ సమాజ సేవలో:

1946లో హైదరాబాదు నారాయణగూడ పద్మశాలి భవన్ కొనుగోలు సమయంలో మొదటి 1000 రూపాయల చందా ఇచ్చి శుభారంభం చేశారు.

అక్కడే పద్మశాలి బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు చదువు అవకాశాలు కల్పించారు.

కరీంనగర్‌లో కూడా హాస్టల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

పద్మశాలి పత్రిక నిర్వహణలో భాగస్వామిగా ఉండి సమాజానికి ఎప్పటికప్పుడు హితబోధ చేశారు.

పద్మశాలి విద్యార్థులకు శాశ్వత విద్యానిధి ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తు బలపరిచారు.

హైదరాబాదు నల్లకుంటలో పద్మశాలి టౌన్‌షిప్ ఏర్పాటు చేశారు.

🗳️ ఎన్నికల్లో:

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోటీ చేసిన ప్రతీసారి కావలసిన ఆర్థిక, సామాజిక బలాలను ఏకం చేసి, ఆయన విజయానికి తోడ్పడ్డారు.

🙏 గుంటక నర్సయ్య పంతులు గారు జీవితాంతం పద్మశాలి కులాభివృద్ధికి, చేనేత పారిశ్రామికుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు.

🌸 ఆయన జయంతి సందర్భంగా మనమంతా ఈ మహోన్నత నాయకునికి హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం 🌸

Tags: