అభివృద్ధి ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

WhatsApp Image 2025-01-20 at 15.00.41

విశ్వంభర, పెద్ద శంకరంపేట:  జనవరి 21 తెలంగాణ ప్రజలకు అభివృద్ధి పాలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని పెద్ద శంకరంపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నూతన అంబులెన్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మండల పరిధిలోని బుజ్రానపల్లి గ్రామంలో సీసీ రోడ్ పనులకు శెంకుస్థాపన ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఉత్లూర్ మన ఊరు మనబడి పథకంలో మరమ్మతులు చేసిన పాఠశాల భవనంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ కింద 4 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడలు ఎమ్మెల్యే ప్రారంభించారు.

Read More అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 

అనంతరం ఆసుపత్రిలో రోగులతో వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  ఆసుపత్రిలో  రికార్డ్ లను తనిఖీ చేశారు. ప్రతి డాక్టర్ అందుబాటులో ఉండాలని తెలిపినారు. అందరూ రాజీవ్ ఆరోగ్యశ్రీ ని వినియోగించుకోవాలని ప్రతి ఒకరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. నేటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో  ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒకరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 1000000 వరకు చికిత్సకు  ప్రభుత్వం బాధ్యత తీస్కుంటుందని తెలిపారు. తరువాత ఉత్లూర్ లో మన ఊరు మనబడి కార్యక్రమంలో మరమ్మత్తులు చేసిన పాఠశాలను నలభై లక్షలతో నిర్మించిన కాంపౌండ్ వాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

పాఠశాలల అభివృద్ధి కోసం  ఎపుడు అందుబాటులో ఉంటాను అందరూ కూడా మీయొక్క పిల్లల ను ఎప్పటికి అపుడు  పర్యవేక్షిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గ్రేసీ బాయ్ ఎంఈఓ వెంకటేశం, డిఈ, ఏఈతో పాటు మండల అధ్యక్షులు రాయిని మధుసూధన్, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, ఎంపీటీసీ శుభాష్ గౌడ్, మాజీ  సర్పంచ్ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి, మెదక్ మహిళ సంగం అధ్యక్షురాలు భవాని చారి, సంగమేశ్వర్ సెట్, రవీందర్ పటేల్, సుభాష్ సార్, సాయిలు, విట్టల్, అనంతరావు, అంజిరెడ్డి, శ్రీశైలం, గోవిందరావు పటేల్,  మాజీ ఎంపీటీసీ సాయి రెడ్డి రాజు మండల యూత్  అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి,  మండల యూత్ పట్టణ అధ్యక్షులు భాను గౌడ్, శేషిధర్ రెడ్డి, నిరుడు సాయిలు, ప్రతాప్ గౌడ్, మల్లేశం, వీర గౌడ్,  మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మైపాల్ గౌడ్ కోళ్లపల్లి సాయిలు మహేష్ సాయిలు యాదయ్య  పల్లె రవి NSUI వెంకట్ గౌడ్ సాయిలు శివ తదితరులు పాల్గొన్నారు మండల్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ పి. విజయ్

Tags: