యువత క్రీడల్లో రాణించాలి
బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ పాండు రంగారెడ్డి
విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండలంపెద్దదేవులపల్లి గ్రామంలోని యువతకు సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ కిట్, క్రికెట్ కిట్ మరియు ఎల్ఈడీ లైట్లను బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి అందజేయడం జరిగింది. తదనంతరం బుసిరెడ్డి పాండు రంగారెడ్డిని గ్రామ యువత శాలువాతో ఘనంగా సత్కరించారు. పాండురంగారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లోరాణించాలని మరియు శారీరకంగా, మానసికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తే రానున్న తరాలకు బాసటగా నిలుస్తారని పాండురంగారెడ్డి అన్నారు. రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ టోర్నమెంట్‌ని ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో బాబుసాయిపేట మాజీ సర్పంచ్ కలగాని శ్రావణ్ కుమార్, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ వైస్ యంపీపీ తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, పీఏసీఎప్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్,కొప్పు సోమయ్య,నాయిని సంతోష్,గంగులసూరయ్య,నాగచారి,సైదాచారి,వెంకన్న,కొండేటి భరత్,సింగం శంకర్,సరగాండ్ల నవీన్,మహ్మద్ బషీర్, షేక్ నయీమ్ బాబా,ఐతగాని సందీప్,బోలా పవన్,బుడిగె వినోద్,సైదాచారి, గజ్జల శివారెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, పోలోజు రమేష్ చారి, ఇస్రం లింగస్వామి మరియు పెద్దదేవులపల్లి యూత్ తదితరులు పాల్గొన్నారు.



