ప్రజా గొంతుక మొహమ్మద్ ముస్తాక్ అలీ ని గెలిపించండి

ఆఫ్ కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్

ప్రజా గొంతుక మొహమ్మద్ ముస్తాక్ అలీ ని గెలిపించండి

విశ్వంభర, బషీర్ బాగ్: ప్రజాసమస్యల పరిష్కరంలో ముందుండే విద్యావంతుడు, మైనారిటీ బీసీ సామజిక వర్గనికి చెందిన ప్రజా గొంతుకైన స్వతంత్ర అభ్యర్థి మొహమ్మద్ ముస్తాక్ అలీ ను కరీంనగర్‌, మెదక్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర అభ్యర్థి మొహమ్మద్ ముస్తాక్ అలీ కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందని, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ లలో ఆప్ శ్రేణులు మొహమ్మద్ ముస్తాక్ అలీ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్ధి, నిరుద్యోగ, దళిత, మైనారిటీ, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఆయనకే మద్దతు ప్రకటించాయని అన్నారు. బిసి, ఎస్.సి, ఎస్.టి లను విస్మరించి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ లు రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట వేయడం దుర్మార్గమన్నారు. ఓటుకు 5 వేలు, 2 వేలు ఆశజూపి గ్రాడ్యుయేట్‌ ఓటర్లలకు ప్రలోభాలకు కాంగ్రెస్‌, బీజేపీ లు గురిచేస్తున్నాయని అయన ఆరోపించారు. గ్రాడ్యుయేట్‌ ఓటర్ల ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిజాయతీగా తమ ఓటు హక్కు ను వినియోగించు కోవాలన్నారు. బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీసీ బిడ్డగా పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి  మొహమ్మద్ ముస్తాక్ అలీ ను గ్రాడ్యుయేట్‌ ఓటర్లు సీరియల్ నెంబర్ 43, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రాడ్యుయేట్‌ ఓటర్లు మొహమ్మద్ ముస్తాక్ అలీ ఎమ్యెల్సీ గా గెలిపిస్తే శాసన మండలిలో ప్రజల గొంతుకగా, ప్రజాసమస్యల పరిస్కారం కోసం గళమెత్తుతాడని డాక్టర్ దిడ్డి సుధాకర్ చెప్పారు.

Tags: