ఘనంగా విత్రీ న్యూస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కేంద్ర ఖాది చిన్న పరిశ్రమల మండలి పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

ఘనంగా  విత్రీ న్యూస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కేంద్ర ఖాది చిన్న పరిశ్రమల మండలి పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

  • సమస్యలు ఉన్నచోట విత్రీ ఛానల్ ముందుండి పరిష్కారం దిశగా సాగుతుంది. 
  • ప్రజాపక్షమే తమ లక్ష్యం సమాజ హితంగా ముందుకు వెళ్తుంది. 
  • యాజమాన్యానికి , సిబ్బందికి , తెలుగు రాష్ట్రాల రిపోర్టర్ల కు శుభాకాంక్షలు 

విశ్వంభర, హనుమకొండ : విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక , టెలివిజన్ మాధ్యమాల 2025 నూతన  సంవత్సర  క్యాలెండర్ ను  కేంద్ర ఖాది చిన్న పరిశ్రమల మండలి పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం తన నివాసంలో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియపరుస్తూ ముందుకు సాగుతూ వెళ్తుంది.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూలగ్రామాల నుండి ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ఎక్కడ రాజీ  పడకుండా నిష్పక్షపాతంగా పురోగమిస్తుంది.  నిజాన్ని నిర్భయంగా రాస్తూ ఎవరి పక్షాన ఉండకుండా ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా , న్యాయం దిశగా ఉండాలని కోరుతూ విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక , టెలివిజన్ మాధ్యమాల సీఎండీ డా. కాచం సత్యనారాయణ కు , యాజమాన్యానికి , సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్, నరేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 

Tags: