తెలంగాణ బీసీ మహాసభ డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

తెలంగాణ బీసీ మహాసభ డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

విశ్వంభర, షాద్ నగర్ :  తెలంగాణ బీసీ మహాసభ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే  వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీసీలు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో రాణించాలని అన్నారు. మానపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ , జాతీయ అఖిల భారత బీసీ సంఘటన్ సమితి జాతీయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ బీసీ కులాలను చైతన్య పరచాలని సబ్బండ కులాల ఆలోచన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పన కోసం నిరంతరం బిసి మహాసభ పోరాటం చేస్తుందని అన్నారు. తెలంగాణలో 60 శాతం ఉన్న బీసీలు సామాజిక న్యాయం ఆత్మగౌరవం రాజ్యాధికారం దిశగా బీసీ మహాసభ మును మందు మరెన్నో కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మానపాటి ప్రదీప్ కుమార్,   కటికే  కృష్ణాజి,  క్యూసెట్ శ్రీనివాస్, ఏవీఎం శ్రీధర్ వర్మ,  మంగ అశోక్,  కొడిచెర్ల యాదయ్య, మాధవాచారి, వేణుగోపాల్, పాలాది శ్రీనివాస్ , క్యాత్ర మోని మల్లేష్, కొంకళ్ళ చెన్నయ్య ముదిరాజ్, చెంది తిరుపతి రెడ్డి, దంగు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement