నూతన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
On
విశ్వంభర, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64వ డివిజన్ మడికొండ ధర్మసాగర్ రోడ్డు లో గల A కన్వెన్షన్ నూతన ఫంక్షన్ హాల్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత యాజమానీ రాచర్ల శంకరయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు.అనంతరం ఫంక్షన్ హాల్ పూజ నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదనంతరం యాజమాన్యం వారు ఎమ్మెల్యే నాగరాజు గారికి బహుమతి ప్రధానం చేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



