కొంపల్లి మున్సిపాలిటీలో టి.పి.ఓ విభాగం ఇంచార్జ్ పాలనకే పరిమితమా.......?

కొంపల్లి మున్సిపాలిటీలో టి.పి.ఓ విభాగం ఇంచార్జ్ పాలనకే పరిమితమా.......?

  • బహుళ అంతస్తులకు  అక్రమ నిర్మాణదారులుకు అధికారులు కొమ్ము కాస్తున్నారా ..?
  • కుర్చీలకే పరిమితం అయ్యారా.. !
  • అధికారులకు  ముడుపులు అందుతున్నాయా......? 

విశ్వంభర, కొంపల్లి : కొంపల్లి మున్సిపాలిటీ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలనలో మున్సిపాలిటీ కొనసాగుతుంది. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత చెర్మన్ గా  సన్న శ్రీశైలం యాదవ్,  కమిషనర్ జ్యోతిలు మున్సిపాలిటీని పాలకవర్గంతో పరిపాలన కొనసాగించారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక ప్రస్తుతం చంద్రమోహన్ ప్రత్యేక అధికారితో,  కమిషనర్ కృష్ణారెడ్డిలతో టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ లు ప్రజలకు సేవలను అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అధికారులు మరీనా మున్సిపాలిటీలో అన్ని పనులపై పెట్టిన దృష్టి అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారికి గాని.కమిషనర్ కి కనపడటంలేదా అంటూ పలువురు చెవులు కోరుకుంటున్నారు. అనుమతులు ఉన్నదానికంటే అధికంగా స్థానిక బడానాయకుల కనుసైగల్లో అధికారుల కళ్ళు గప్పి అనుమతులు లేని బహుళ అంతస్తులను అక్రమ నిర్మాణదారులు నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణదారుని సమాచారం అడుగగా స్థానిక కౌన్సిలర్ మరియు బడానాయకుల పేర్లు చెబుతూ తూతూ మంత్రంగా సంధానం చెప్తూ వాళ్లతో మాట్లాడండి అంటూ తప్పించుకుంటున్నారు. మరి అధికారులు కేవలం మున్సిపాలిటీ కార్యాలయంలో కుర్చీలకే పరిమితం అయ్యారా....లేక...చాటుమాటున అధికారులకు  ముడుపులు అందుతున్నాయా......? సక్రమ విధులు నిర్వహిస్తే  అక్రమ నిర్మాణాలు ఎందుకు వెలుస్తాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా  మారింది. ఇకనైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Tags: