ఈది బజార్ యూపీహెచ్ సి లో ఆకస్మిక తనిఖీలు

ఈది బజార్ యూపీహెచ్ సి లో   ఆకస్మిక తనిఖీలు

విశ్వంభర, హైదరాబాద్ : పాతబస్తీ చంద్రాయణ గుట్ట నియోజకవర్గం లలితా బాగ్ డివిజన్ లోని ఈది బజార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను చంద్రాయణ గుట్ట నియోజకవర్గo ఇన్ ఛార్జ్ బోయ నాగేష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.  ప్రజలకు అందించే వైద్యం పట్ల వైద్య సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందికి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరం కావడానికి వస్తున్న ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో  బోయ నాగేష్ మాట్లాడుతూ ప్రజలు డాక్టర్ సక్రమంగా ఉండడం లేదని ఫిర్యాదు మేరకు  ఈది బజార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు రావడం జరిగింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి కోరామని తెలిపారు. ఆసుపత్రి లో డాక్టర్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి సమస్యపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ,  ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే  సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

Tags: