మహిళలు లేనిది ప్రపంచం లేదు: సముద్రాల రమేష్ గుప్తా

మహిళా దినోత్సవం సందర్బంగా మజ్జిగ పంపిణీ

మహిళలు లేనిది ప్రపంచం లేదు: సముద్రాల రమేష్ గుప్తా

విశ్వంభర, ఎండపల్లి: మహిళలు లేనిది ప్రపంచం లేదని తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అద్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా అన్నారు. శనివారం ఎండపల్లి మండలం, అంబారీపేట గ్రామంలో మహిళా దినోత్సవం, వార్త దినపత్రిక సీఎండీ మాజీ రాజ్య సభ సభ్యులు గిరీష్ సంఘీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉపాధి హామీ పనులకు వెళ్లి వస్తున్న మహిళాలకు 80 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ మహిళలు లేనిది ప్రపంచం లేదనీ, వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అల్లంల రాజయ్య, ఎనగంటి దుబ్బయ్య, ఆరెళ్లి రాహుల్, జాడి బాపు, తదితరులు పాల్గొన్నారు.

Tags: