పేదల సంక్షేమానికి పెద్దపీట

పేదల సంక్షేమానికి పెద్దపీట

విశ్వంభర, చేవెళ్ల :  స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మొయినాబాద్ మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన Rs.15,01,740/- (రూపాయలు పదిహేనులక్షల ఒకవేయి ఏడువందలనలబై) విలువ గల 15 షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం మొయినాబాద్ మండలానికి చెందిన  లబ్ధిదారులకు మంజూరైన Rs.14,19,000/- (రూపాయలు పద్నాలుగు లక్షల పంతొమ్మిది వేలు) విలువ గల 17 ముఖ్యమంత్రి సహాయనిది  చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: