ప్రారంభమైన ప్రత్యేక అధికారుల పాలన
ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన..జగదీశ్వర్ రెడ్డి
విశ్వంభర చివ్వేంల :- మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ రెడ్డి, గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయ అధికారులు ,సిబ్బంది వారిని పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి అక్కడి ఉద్యోగుల వివరాలు తెలుసుకొని ,ఓపీ రిజిస్టర్ ను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోగులకు అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి వెంట ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ , మెడికల్ ఆఫీసర్ భవాని ,సిహెచ్ఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.